![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -694 లో.....జ్యోత్స్న కావాలనే దీపని ఓడించడానికి కుట్ర చేసిందని సాక్ష్యలతో సహా సూరజ్ నిరూపిస్తాడు. దాంతో జ్యోత్స్నని అందరు తిడతారు. నిన్ను తిట్టడానికి కూడా నాకు మాటలు రావడం లేదు.. ఇక మీద ఇది నా కుటుంబమని చెప్పాల్సి వస్తే అందులో నువ్వు ఉండవు.. నీకు మనవరాలు ఉంది కదా అని ఎవరైనా అడిగితే ఒకప్పుడు ఉండేది.. ఇప్పుడు దీపలో నా మనవరాలిని చూసుకుంటున్నానని చెప్తానంటూ శివన్నారాయణ అంటాడు. మావయ్య గారు కరెక్ట్ గా చెప్పారు.. దానితో ఎవరు మాట్లాడకండి అని సుమిత్ర అంటుంది.
అందరు వెళ్ళిపోతారు.. సూరజ్ వెళ్తు నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని అంటాడు. సూరజ్ వెళ్తుంటే జ్యోత్స్న చిటికేసి పిలుస్తుంది. నిన్ను చీకట్లో నిల్చొపెట్టి రివెంజ్ తీర్చుకుంటే నువ్వు మాత్రం నా ఇంట్లో పట్టపగలు దొషిని చేసావ్.. శబాష్ రా నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నానని సూరజ్ ని జ్యోత్స్న పొగుడుతుంది. కానీ నిన్ను అంత తేలికగా వదలను చంపేస్తానని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది కానీ సూరజ్ నవ్వుతు ఉంటాడు. ఎంట్రా నీకు వార్నింగ్ ఇస్తున్నానని జ్యోత్స్న అంటుంది. నువ్వు వార్నింగ్ ఇస్తే నేను ఎందుకు తీసుకోవాలని సూరజ్ అంటాడు. ఐ లవ్ యూ అని సూరజ్ చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏమన్నావని అడుగుతుంది. నేను మళ్ళీ ఎందుకు చెప్పాలి.. చాలా థాంక్స్ నీ అందమైన చేతులతో నన్ను తాకావ్.. నన్ను తాకిన మొదటి అమ్మాయివి నువ్వే అని సూరజ్ అంటుంటే.. జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ జరిగింది గుర్తుచేసుకొని మాట్లాడుకుంటారు.
అప్పుడే జ్యోత్స్న వస్తుంది. సూరజ్ ఇచ్చిన షాక్ నుంచి బయటకు రాకముందే.. మళ్ళీ దీప, కార్తీక్ ఇద్దరు తమ మాటలతో జ్యోత్స్నని టార్చర్ పెడతారు. ఆ తర్వాత జ్యోత్స్న రౌడీకి ఫోన్ చేసి సూరజ్ ని చంపమని చెప్తుంది. మరోవైపు సుమిత్ర దగ్గరికి దీప వెళ్తుంది. దీప నన్ను క్షమించు నా కూతురు చేసిన పనుల వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావని సుమిత్ర అంటుంది. అలా అనకండి అమ్మ అని దీప చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |